తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రణ్​బీర్​ వల్ల నేను కచ్చితంగా అలా అయిపోతాను! : అనుష్క శర్మ - Ranbir Kapoor Anushka Sharma - RANBIR KAPOOR ANUSHKA SHARMA

Ranbir Kapoor Anushka Sharma : హీరో రణ్​బీర్​ కపూర్ గురించి అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది!. ప్రస్తుతం అది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Source ANI
Ranbir Kapoor Anushka Sharma (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 8:00 AM IST

Ranbir Kapoor Anushka Sharma:విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ - 'యానిమల్' హీరో రణబీర్ కపూర్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. పాన్-ఇండియా క్రేజ్ దక్కించుకున్న రణబీర్ గతంలో అనుష్క శర్మతో కలిసి ఏ దిల్ హై ముష్కిల్​తో పాటు బాంబే వెల్వెట్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఈ ఫ్రెండ్లీ జంట ఏ ప్రమోషనల్ ఈవెంట్​లో కలిసినా జోక్​లు వేసుకుంటూ సరదాగా కనిపిస్తుంటారు. అయితే వీరిద్దరి గురించి బాలీవుడ్ మీడియాలో చాలా గాసిప్స్​ కూడా వినిపించేవి.

ఇప్పుడు కూడా రణ్​బీర్​-అనుష్కకు సంబంధించిన పాత వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలా బాంబే వెల్వెట్​ ప్రమోషన్ కార్యక్రమం సమయంలో జరిగిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. అందులో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. అందులో అనుష్క శర్మ తాను రణ్​బీర్​ వల్ల గ్రేట్ మదర్ అవుతానని చెప్పుకొచ్చింది. అది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

అలానే ఆ వీడియోలో రణబీర్ గురించి అనుష్క మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రణ్​బీర్​ క్యూరియస్‌గా ఉంటూ అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడట. ఆమె డ్రెస్సింగ్ రూంలోకి కూడా వచ్చేసి డ్రాయర్స్, కప్ బోర్డ్స్ అన్నీ తెరిచి చూస్తాడట. సెట్‌లో అతడిని డీల్ చేయడం ఒక పిల్లాడిని హ్యాండిల్ చేసినట్లుగానే ఉండేదని అనుష్క చెప్పింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ మొత్తం వల్ల తాను గ్రేట్ మదర్ అవుతానని చెప్పింది. అలానే రణ్​బీర్​కున్న ఈ అలవాట్లు వల్ల అతడు నిర్మాతగా మారేందుకు కూడా పనికొస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ వీడియో చక్కర్లు కొడుతోంది.

ఇక ప్రొఫెషన్ విషయానికొస్తే అనుష్క శర్మ చక్దా ఎక్స్‌ప్రెస్‌(Chakda X'Press)లో నటించారు. ఇది టీమిండియా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్. మరోవైపు రణబీర్ కపూర్ లవ్ అండ్ వార్, రామాయణ్ సినిమాల్లో నటిస్తున్నారు. లవ్ అండ్ వార్ సినిమాలో తన భార్య అలియాతో పాటు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క - విరాట్‌లకు ఇప్పటికే వామికా, అకాయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రణబీర్ కూడా అలియాను పెళ్లాడి రహా అనే కూతురికి తండ్రి అయ్యాడు.

'లవ్ చేసిన ప్రతిసారీ మోసపోయా' - మనీశా కోయిరాలా ఎమోషనల్ - Manisha Koirala Relationships

తొలి జీతం రూ.1500 - ఇప్పుడు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ - ఆ స్టార్ హీరో ఎవరంటే? - Karthik Aryan

ABOUT THE AUTHOR

...view details