Navodaya Vidyalaya Exam Date 2025 :గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో నైపుణ్యమైన విద్యనందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, దేశ వ్యాప్తంగాజవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి విద్యార్థులకు ఈ నెల 18న పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నవోదయ ఎగ్జామ్‌కు వెళ్లే విద్యార్థులకు నిపుణులు కొన్ని ముఖ్య సూచనలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
ఇప్పటికే జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు అప్లై చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి.
సూచనలు :
- ఎగ్జామ్ రాసే విద్యార్థులు రెండు హాల్ టికెట్లు డౌన్‌లోన్ చేసుకోవాలి.
- హాల్ టికెట్‌పై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన ఒక హాల్ టికెట్ ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
- బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్ష రాయాలి.
- గంట ముందుగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాలి.
- విద్యార్థులు తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు.
- రాత పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు ఉంటుంది.
- విద్యార్థులను 10.45 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తారు.
- మార్నింగ్ 11 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
- తర్వాత ఒక్క నిమిషం అలస్యమైనా పరీక్ష కేంద్రంలోపలికి అనుమతించరు.
పరీక్ష విధానం :