Toppers Inspiring Stories: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి పూర్తి అయ్యింది. ఈ ఫలితాల్లో విద్యార్ధులు సాధించిన ప్రతిభ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. మన రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల్లానే పక్కనే ఉన్న కర్నాటకలోనూ SSLC పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఓ చిన్నారి సాధించిన మార్కులు అందరికీ ఆశ్చరమేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 599/600 మార్కులతో ప్రశంసలు అందుకోగా.. తాజాగా కర్ణాటకలో ఓ అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించి అదరహో అనిపించింది.
599/600 - టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ
కర్నాటకలోని కొన్నూరు బాగల్‌కోట్ జిల్లా, ముధోల్ తాలూకా మెల్లిగేరి గ్రామంలో మొరార్జీ దేశాయ్ పాఠశాలకు చెందిన అంకిత బసప్ప 625 మార్కులకు 625 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానం రావడం పట్ల అందకిత సంతోషం వ్యక్తం చేసింది. పైగా నాకు వచ్చిన మార్కుల పట్ల నాకంటే నా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. " పీయూసీలో సైన్స్ విభాగం చదివి ఐఏఎస్ కావాలన్నది నా కల, నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు రెండవ తరగతి, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు." అని అంకిత చెప్పారు. తండ్రి బసప్ప రైతు కాగా.. తల్లి గృహిణి.