ETV Bharat / state

పండించారు.. పశువులకు మేతగా వేస్తున్నారు

author img

By

Published : Mar 15, 2020, 2:34 PM IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన తమ పంటలకు గిట్టుబాటు ధర లభించక విలవిల్లాడుతున్నారు. ఏపుగా పెరిగిన పంట నుంచి అధిక దిగుబడులు రావడం వల్ల కష్టాలన్నీ తీరుతాయని భావించిన వారికి నిరాశ ఎదురవుతోంది. పండించిన ఉత్పత్తులను మార్కెట్లో కొనే నాథుడే లేకపోవడం వల్ల పలువురు రైతులు తాము పండించిన పంటలను తోటలోనే పశువులకు వదిలేస్తున్నారు.

heavy loss to farmers by falling vegetables rates in market
పండించారు.. పశువులకు మేతగా వేస్తున్నారు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కి సిద్దిపేట జిల్లా అత్యంత చేరువలో ఉంటుంది. ఇక్కడి రైతులు ఎక్కువగా కూరగాయ తోటలు సాగు చేస్తుంటారు. ఉద్యాన శాఖ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 15 వందల ఎకరాల్లో టమాటా, 7 వందల ఎకరాల్లో మిరప, 3 వందల ఎకరాల్లో వంగ, 5 వందల ఎకరాల్లో బెండ, 100 ఎకరాల్లో సొరకాయ సాగు చేస్తున్నారు. పండించిన కూరగాయలన్నీ హైదరాబాద్‌ నగరంలోని మార్కెట్లకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు.

ఇతర రాష్ట్రాల నుంచి..

ప్రస్తుతం మార్కెట్​లో వీటిని కొనడానికి వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో కూరగాయలు హైదరాబాద్‌ నగరానికి ప్రతినిత్యం రావడమే.

ధరలు పడిపోవడం వల్ల..

ఈ క్రమంలో చాలా మంది రైతులు పొలంలోనే తోటలపై కాయలను వదిలేస్తున్నారు. పశువులకు మేతగా వాడుతున్నారు. ముఖ్యంగా టమాటా, మిరప, సొరకాయ, వంకాయలు, బెండకాయలు తదితర కూరగాయల పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. ఒకేసారి అన్నీ కోతకు వస్తుండటం వల్ల ధరలూ పడిపోయాయి. రైతుల పరిస్థితి ఇలా ఉంటే... రైతు నుంచి కిలో రూ.2 చొప్పున కొంటున్న వ్యాపారులు మాత్రం నగరంలోని సూపర్‌ మార్కెట్లలో అదే టమాటా కిలో సుమారు రూ.6కు విక్రయించుకుంటున్నారు. ఇలా ఏ విధంగా చూసినా పంటలు పండించిన రైతులకు నష్టాలు తప్పడం లేదు.

ఇదీ చూడండి : కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.