ETV Bharat / state

కరుణ చూపని కరోనా: మొదట తండ్రి, ఇప్పుడు తనయుడు.. విషమంగా మరొకరు

author img

By

Published : Sep 5, 2020, 9:37 AM IST

ఇన్ని రోజులు ఆనందోత్సవాలతో గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. వారి కుటుంబంలో మరణ మృదంగం చేస్తోంది. ఇంటిల్లిపాదినీ వదలని వైరస్.. మొదట ఇంటి పెద్దదిక్కును తీసుకొని పోయింది. అప్పటికే ఓ కుమారుడు నెలరోజులకు పైగా ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే మరో కుమారుడు శుక్రవారం ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

father-and-son-die-of-corona-infection
కరుణ చూపని కరోనా: మొదట తండ్రి, ఇప్పుడు తనయుడు.. విషమంగా మరొకరు

మంచిర్యాల జిల్లా చెన్నూరు స్వస్థలానికి చెందిన చకినారపు భూమయ్య కుమారులు మంచిర్యాలలో నక్షత్ర ఇంజినీరింగ్ దుకాణం నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. భూమయ్యకు నలుగురు కుమారులు కాగా.. అందులో మూడోవాడైన చరణ్ కుమార్ 20 సంవత్సరాల కిందటే చనిపోయారు.

40 రోజుల క్రితం భూమయ్యతో పాటు రెండో కుమారుడు కిరణ్ కుమార్ అదే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులకు కరోనా సోకింది. వీరిలో చిన్నారులు వైరస్ నుంచి బయటపడగా.. భూమయ్య 15 రోజుల కిందట చనిపోయారు. కిరణ్ కుమార్ ఇప్పటి వరకు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాసతోనే చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలోనే మరో కుమారుడు కిషోర్ కుమార్​కూ కరోనా సోకింది.

మొదట ఇంట్లోనే చికిత్స పొందగా, ఆరోగ్యం విషమించగా హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో పట్టణంలోని ఇంజినీరింగ్ దుకాణ వ్యాపారులు శుక్రవారం దుకాణాలు మూసివేసి కిషోర్ కుమార్​కు సంతాపం తెలిపారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.