ETV Bharat / state

నాగార్జున సాగర్ బరిలో మేమూ ఉన్నాం: మందకృష్ణ

author img

By

Published : Mar 27, 2021, 5:57 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో మద్యం, డబ్బులు పంపిణీ చేయమని ఇష్టదైవాలపై ప్రమాణం చేస్తారా అని మహజన సోషలిస్ట్‌ పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సవాల్​ విసిరారు. ఈ ఎన్నికలో తమ అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్​లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

mrps president mandha krishna madiga
మందకృష్ణ మాదిగ

నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో తమ అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. అన్ని ప్రధాన పార్టీలు డబ్బు, మద్యం పంపిణీ చేయమని వారి ఇష్ట దైవాలపై ప్రమాణం చేయాలని సవాల్​ విసిరారు. హైదరాబాద్​లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ చీఫ్​ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రమాణం చేశాకే ఓట్లు అడగాలన్నారు. ఈనెల 30వ తేదీన తమ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్​ సాధించిన విజయాలు, ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ప్రేమ చూపిస్తాయని విమర్శించారు. బలహీన వర్గాల ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే సాగర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మందకృష్ణ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఖమ్మంలో కేటీఆర్​ పర్యటన మరోసారి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.