ETV Bharat / state

'అధ్యక్ష పదవికి జయేశ్​రంజన్​ అర్హుడు కాదు'

author img

By

Published : Feb 3, 2020, 4:58 PM IST

తెలంగాణ ఒలింపిక్​ అసోషియేషన్​ అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి కావాల్సిన అర్హతలు జయేశ్​రంజన్​కు లేవని మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి ​ స్పష్టం చేశాడు. నామినేషన్​ తిరస్కరణకు కారణాలను అధికారులు వెల్లడించారని పేర్కొన్నారు.

MP JITHENDHER REDDY COMMENTS ON JAYESH RANJAN

తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్ష పదవికి జయేశ్​రంజన్​ వేసిన నామినేషన్ తిరస్కరణకు కారణం చెప్పలేదనడం అబద్దమని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరస్కరణకు గల కారణాలను రిటర్నింగ్​ అధికారి మెయిల్ రూపంలో ఇచ్చారని పేర్కొన్నారు.

అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఏదో ఒక అసోషియేషన్‌లో ఈసీ సభ్యుడై ఉండాలన్న జితేందర్​రెడ్డి... జయేశ్​రంజన్ ఏ స్పోర్ట్స్‌ అసోషియేషన్‌లోనూ సభ్యుడు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఒలంపిక్ అసోషియేషన్ అధ్యక్ష పదవికి రంగారావును తానే సిఫారసు చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ఒక టర్మ్​ అధ్యక్షునిగా పనిచేసిన తనకు పదవిపై ఆసక్తి లేదన్నారు. జయేశ్​ రంజన్ నామినేషన్ వేసినందునే తానూ రంగంలోకి దిగినట్లు వివరించారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌ను నడపటానికి ఏడాదికి రూ. 30లక్షలు కావాలని పేర్కొన్నారు. దిల్లీలో ఎన్నికలు జరపటానికి ఏజీఎం సమావేశంలో అందరూ అంగీకరించారని జితేందర్​రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.