ETV Bharat / sports

'భాగస్వామ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాం'​

author img

By

Published : Dec 27, 2020, 10:31 PM IST

ఆస్ట్రేలియాతో బాక్సింగ్​ డే టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే.. బ్యాట్స్​మెన్​ భాగస్వామ్యం ద్వారానే ఈ స్థానం సాధ్యమైందని చెప్పాడు టీమ్​ఇండియా ఆటగాడు శుభ్​మన్​ గిల్​.

Ability to build partnerships helps India in first innings
భాగస్వామ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాం:గిల్​

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలిఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా ఆధిపత్యం కనపరుస్తోంది. రెండోరోజు ఆటపూర్తయ్యే సరికి 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోయింది. అయితే.. బలమైన బ్యాట్స్​మెన్​ భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం వల్లే.. ప్రత్యర్థులను ధాటిగా ఎదుర్కోగలగామని అన్నాడు టీమ్​ఇండియా ఆటగాడు శుభ్​మన్​ గిల్.​ మ్యాచ్​కు ముందే తాము ఈ అంశంపై చర్చించుకున్నామని తెలిపాడు.

"మ్యాచ్​కు ముందే బ్యాట్స్​మెన్​ భాగస్వామ్యంపై మేమంతా చర్చించుకున్నాం. ఇన్నింగ్స్​లో మా మొదటి వికెట్​ కోల్పోయినప్పుడు.. సాధ్యమైనంత మేర మా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నేను.. పుజారా అనుకున్నాం. ప్రస్తుతం రహానే, జడేజా మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నడుస్తోంది. వాళ్లు దాన్ని 150 లేదా అంతకంటే ఎక్కువకే తీసుకు వెళ్లగలరని నేను అనుకుంటున్నాను."

--శుభ్​మన్​ గిల్​, టీమ్​ఇండియా ఆటగాడు.

36 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ 61 పరుగుల వద్ద శుభమన్‌ గిల్(45) వికెట్‌ కోల్పోయింది. అర్ధ శతకం దిశగా సాగుతున్న అతడిని కమిన్స్‌ బోల్తా కొట్టించాడు. ఓ చక్కటి బంతికి కీపర్‌ పైన్​కు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే అదే రీతిలో పూజారా(17) కూడా కమిన్స్‌ బౌలింగ్‌లోనే పైన్​కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో భారత్‌ ఒక ఓవర్‌ తేడాతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత కెప్టెన్​ అజింక్య రహానే.. హనుమ విహారి(21)తో కలిసి 52 పరుగుల్ని జోడించాడు. విహారి ఔట్​ అయిన అనంతరం... పంత్(29)​తో కలిసి మరో 57 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 7వ స్థానంలో వచ్చిన జడేజాతో కలిసి అదరగొట్టాడు రహానే. వారిద్దరూ కలిసి రెండోరోజు ఆట ముగిసే సమయానికి 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇదీ చూడండి:తొలి టెస్టులోనే శుభ్​మన్ గిల్ ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.