న్యూజిలాండ్ లెగ్‌స్పిన్నర్ ఇష్ సోదీ.. ఇకపై రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ సహాయక కోచ్‌గా సేవలందించనున్నాడు. గత రెండు సీజన్లలో ఇదే జట్టులో ఆటగాడిగా ఉన్న ఇతడు... ఈ ఏడాది బౌలింగ్ మెలకువలు చెప్పే బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ప్రధాన బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహతులే, ప్రధాన ఆపరేషన్స్ అధికారి జేక్ లష్ మెక్కరమ్కు సహాయకుడిగా పనిచేయనున్నాడు.
-
🎵Guess who’s back, back again.
— Rajasthan Royals (@rajasthanroyals) January 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Sodhi’s back, tell a friend. 🎵
Say hello to the Royals’ spin consultant, @ish_sodhi 😍#HallaBol #RoyalsFamily pic.twitter.com/oPubLJcXx9
">🎵Guess who’s back, back again.
— Rajasthan Royals (@rajasthanroyals) January 2, 2020
Sodhi’s back, tell a friend. 🎵
Say hello to the Royals’ spin consultant, @ish_sodhi 😍#HallaBol #RoyalsFamily pic.twitter.com/oPubLJcXx9🎵Guess who’s back, back again.
— Rajasthan Royals (@rajasthanroyals) January 2, 2020
Sodhi’s back, tell a friend. 🎵
Say hello to the Royals’ spin consultant, @ish_sodhi 😍#HallaBol #RoyalsFamily pic.twitter.com/oPubLJcXx9
" ఇష్ సోదీ.. కొత్త బాధ్యతతో జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. యువ క్రికెటర్లకు మంచిగా తర్ఫీదు ఇవ్వగలిగే సత్తా అతడి సొంతం. ఈ వేసవిలో రాజస్థాన్ రాయల్స్‌కు అభిమానుల మద్దతు ఉంటుందని భావిస్తున్నాం"
--జుబిన్ బరుచ, రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ.. ఆటగాడి నుంచి స్పిన్ కన్స్ల్టెంట్ (బౌలింగ్ సహాయక కోచ్)గా పదవీ బాధ్యతలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశాడు ఇష్ సోదీ.
" ఇప్పటివరకు రెండు సీజన్లుగా జట్టులో ఆటగాడిగా ఉన్నా. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇకపై జట్టును బౌలింగ్ విభాగంలో మరింత మెరుగుపర్చేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. జట్టు కోసం పనిచేస్తావా? అని యాజమాన్యం అడగ్గా... ఒక్కమాట ఆలోచించలేదు. వెంటనే ఒప్పేసుకున్నా. ఎందుకంటే ఫ్రాంచైజీ అంటే అంత ఇష్టం. ఈ ఏడాది జట్టను గెలిపించేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను"