ETV Bharat / sitara

'ట్విట్టర్​లో పెయిడ్​ ట్రెండింగ్స్​ మానుకోవాలి'

author img

By

Published : Oct 11, 2020, 4:17 PM IST

సోషల్ ​మీడియాలో పెయిడ్ ట్రెండింగ్స్​ మానుకోవాలంటూ 'మీర్జాపూర్​' ఫేమ్​ దివ్యేందు శర్మ సూచించాడు. 'బాయ్​కాట్​ మీర్జాపూర్​ 2' ట్రెండ్​ చేయడం ఓ మూర్ఖత్వమని.. దీనిని మానుకోవాలంటూ హితవు పలికాడు.

'Boycott Mirzapur 2' trend didn't bother Munna Tripathi aka Divyendu Sharma
'ట్విట్టర్​లో పెయిడ్​ ట్రెండింగ్స్​ మానుకోవాలి'

ఓటీటీల్లో సెన్సేషనల్​ హిట్​ అయిన​ 'మీర్జాపూర్​' వెబ్​ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్​తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 'మీర్జాపూర్ 2​'ను బహిష్కరించాలని సోషల్​ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. 'బాయ్​కాట్​ మీర్జాపూర్​2' అనే హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్​ చేస్తున్నారు. దీనిపై ఈ సిరీస్​లో మున్నా త్రిపాఠి​ పాత్రలో నటించిన దివ్యేందు శర్మ తాజాగా స్పందించాడు. వ్యక్తిగత అభిప్రాయాలతో అభిమానులను ఇబ్బంది పెట్టొద్దని సూచించాడు.

"ఇది నన్ను పెద్దగా బాధపెట్టలేదు. కానీ, 'మీర్జాపూర్​' సిరీస్​కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది ఒక మూర్ఖత్వం. అలాంటి హ్యాష్​ట్యాగ్​లను ఉపయోగించడం మానుకోవాలి. అవి ముమ్మాటికి పెయిడ్​ ట్రెండ్స్​ అని నేను భావిస్తున్నా".

- దివ్యేందు శర్మ, 'మీర్జాపూర్​' నటుడు

2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మీర్జాపూర్​' తొలి భాగం ప్రేక్షకులలో విపరీతమై క్రేజ్​ తెచ్చిపెట్టింది. ఈ వెబ్​సిరీస్​ ద్వారా తన జీవితం ఎంతగానో మారిపోయిందని అంటున్నాడు నటుడు దివ్యేందు శర్మ. "అది మాటల్లో వర్ణించలేని అనుభవం. నేను ఎక్కడికి వెళ్లినా మున్నా భయ్యా అంటూ ప్రతి ఒక్కరూ పలకరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్​లో అయితే ప్రజలు ఆప్యాయంగా పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని తెలిపాడు.

'మీర్జాపూర్​'లోని ఓ నటుడు అలీ ఫజల్​ గతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. దీంతో ఓ వర్గానికి సంబంధించిన వారు అలీ ఫజల్​ నటించిన చిత్రాలను బహిష్కరించాలని సోషల్​మీడియాలో ట్రెండ్​ చేస్తున్నారు. ఇతడు​ నటించిన 'మీర్జాపూర్ ​2' అక్టోబరు 23న అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆ వెబ్​సిరీస్​ను బ్యాన్​ చేయాలంటూ హ్యాష్​ట్యాగ్​ ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.