ETV Bharat / sitara

హాలీవుడ్​ స్థాయిలో షారుక్​ 'పఠాన్​'

author img

By

Published : Jan 30, 2021, 8:15 PM IST

Updated : Jan 30, 2021, 8:56 PM IST

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్​ ఖాన్‌ నటిస్తున్న యాక్షన్‌‌ చిత్రం 'పఠాన్‌'. దుబాయ్​లో​ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్​ సన్నివేశాలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. హాలీవుడ్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'‌ స్థాయిలో ఈ పోరాట సన్నివేశాలు ఉన్నాయి. ఆ వీడియోలు మీరూ చూసేయండి.

sharukh
షారుక్​

హాలీవుడ్​ యాక్షన్​ సినిమా​ 'మిషన్​ ఇంపాజిబుల్'..​ ఈ సిరీస్​లో వచ్చిన చిత్రాలన్నీ రికార్డు సృష్టించాయి. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు, హీరో విన్యాసాలు అభిమానుల్ని కట్టిపడేశాయి. ఇప్పుడు ఇదే తరహా సన్నివేశాలు, విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు బాలీవుడ్​ బాద్​ షా షారుక్​ ఖాన్​.

దాదాపు మూడేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు షారుక్​. అంతకముందు వరుస ఫ్లాప్​లతో ఉన్న బాద్​షా.. ఈ సారి ఎలాగైన హిట్​ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే స్పై థ్రిల్లర్​ 'పఠాన్'​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్​లో షూటింగ్​ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. నెటిజన్లను విపరీతంగా ఆక్టటుకుంటున్నాయి.

ఈ వీడియోల్లో సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్​ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. షారుక్(డూప్​​)​.. బస్సులు, ట్రక్కులు మీద స్టంట్స్​ చేస్తూ కనిపించాడు. అవి చూస్తుంటే ఒళ్లు గగ్గుర పొడిచేలా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రీకరణ సన్నీవేశాలు హాలీవుడ్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'‌ స్థాయిలో ఉన్నాయి.

ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రానికి యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ చిత్ర సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా షూటింగ్‌ గతేడాది నవంబరులోనే ప్రారంభమైంది. ఇందులో జాన్‌ అబ్రహం నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రల్లో నటించనున్నారు. డింపుల్‌ కపాడియా కీలక పాత్రలో నటిస్తోంది.

ఇదీ చూడండి : తొలిసారి ఆ నలుగురితో షారుక్!

Last Updated : Jan 30, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.