ETV Bharat / sitara

సిక్స్ ప్యాక్ ఎన్టీఆర్.. వైరల్ ఫొటో - డబూ రత్నానీ ఎన్టీఆర్ ఫొటో

యంగ్ టైగర్​ ఎన్టీఆర్​కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో తారక్ సిక్స్ ప్యాక్​తో దర్శనమిచ్చారు.

NTR six pack photo goes viral on internet
సిక్స్ ప్యాక్ ఎన్టీఆర్.. వైరల్ ఫొటో
author img

By

Published : Oct 18, 2020, 8:56 PM IST

సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతంలో ప్రముఖుల ఫొటోషూట్‌లో తీసిన స్టిల్స్‌ను ఆదివారం షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉన్న అరుదైన చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

NTR six pack photo goes viral on internet
డబూ రత్నానీ, ఎన్టీఆర్

2018లో 'అరవింద సమేత' సినిమా కోసం తారక్‌ ఇలా ఫిట్‌గా తయారయ్యారు. ఆ సమయంలో క్లిక్‌ మనిపించిన ఫొటో అది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని కొమురం భీమ్‌ పాత్ర కోసం తారక్‌ ఇంకా ఫిట్‌గా మారారు.

తారక్​తో పాటు రత్నానీ సినీ సెలబ్రిటీలు కరీనా కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఆలియా భట్‌, జాన్‌ అబ్రహం, సన్నీ లియోనీ, పరిణీతి చోప్రా, హృతిక్‌ రోషన్‌ తదితరులతో ఫొటోషూట్‌లో భాగంగా తీసుకున్న చిత్రాల్ని పంచుకున్నారు. అవన్నీ కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రత్నానీ భారత్‌లోనే అగ్ర ఫ్యాషన్‌ ఫొటో గ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. ఆయన పేరుతో క్యాలెండర్లు కూడా ప్రచురితం అవుతుంటాయి. అనేక మ్యాగజైన్లకు కవర్‌ ఫొటో గ్రాఫర్‌గా కూడా పనిచేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు మహేశ్‌ బాబు స్టిల్స్‌ను కూడా క్లిక్‌ మనిపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.