ETV Bharat / sitara

నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన నటుడు

author img

By

Published : Nov 23, 2020, 12:59 PM IST

తాను టీనేజ్​లో నాలుగుసార్లు సూసైడ్​కు ప్రయత్నించానని చెప్పాడు నటుడు అమిత్ సాద్. అలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చేందుకు 20 ఏళ్లకు పైగా పట్టిందని తెలిపాడు.

I tried committing suicide 4 times: Sushant's co-star Amit Sadh
నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా: సుశాంత్​ సహనటుడు​

ఇటీవల కాలంలో తమకున్న మానసిక అనారోగ్యం గురించి పలువురు నటీనటులు మాట్లాడుతున్నారు. అలానే తన గురించి చెప్పిన బాలీవుడ్​ నటుడు అమిత్ సాద్.. టీనేజర్​గా ఉన్నప్పుడు(16-18 ఏళ్లు) నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్​లో వచ్చిన 'బ్రీత్: ఇన్​టూ ద షాడోస్' సిరీస్​తో ఆకట్టుకున్నాడు అమిత్.

"16-18 ఏళ్ల వయసులో నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. అలాంటి ఆలోచనలు లేకపోయినా.. ప్రాణం తీసుకోవాలనిపించింది. అలా కొన్నాళ్ల తర్వాత దేవుడి దయవల్ల ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాను. అనంతరం నేను చేసే పనుల్లో, నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచి నాలో పట్టుదల పెరిగింది"

- అమిత్​ సాద్​, బాలీవుడ్​ నటుడు

అలాంటి ఆలోచనల నుంచి బయట పడటం కేవలం ఒక్కరోజులో జరగిపోలేదని అమిత్ అన్నాడు. దాదాపు 20 ఏళ్లు పోరాడిన తర్వాత, జీవితం ఇంతటితో ఆగిపోకూడని తెలిసిందని చెప్పాడు. జీవితం విలువ తెలుసుకున్న తర్వాత ఆస్వాదించడం మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తు తనకంటూ ఓ గుర్తింపు లభించిందని, ఇప్పుడు అలాంటి బలహీనతతో బాధపడుతున్న వారిని చూస్తే జాలి కలుగుతుందని అమిత్ అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.