ETV Bharat / lifestyle

మిహికా లెహెంగాకి... పదివేల గంటలు

author img

By

Published : Aug 11, 2020, 10:33 AM IST

మిహీకా బజాజ్‌... రానాతో కలిసి ఏడడుగులు వేశారు. అయితే మిహీకా తన పెళ్లిలో లేతవర్ణాల కలయికతో పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన లెహెంగాలో మెరిసిపోయారు. ఈ లెహెంగా తయారీకి సుమారు పదివేల గంటల సమయం పట్టిందట.

special story on Mihika Lehenga
మిహికా లెహెంగాకి... పదివేల గంటలు

మిహీకా బజాజ్‌ తన స్నేహితుడు రానా దగ్గుబాటితో కలిసి ఏడడుగులు వేశారు. వివాహ వేదికపై వరుడు రానా లేతబంగారు వర్ణం దుస్తుల్లో కనిపించగా, లేతవర్ణాల కలయికతో పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన లెహెంగాలో నవ వధువు మిహీకా మెరిసిపోయారు. ఈ అందమైన దుస్తుల వెనుక ప్రముఖ దుస్తుల డిజైనర్‌ అనామికా ఖన్నా సృజనాత్మకత నిండి ఉంది. ‘ఈ లెహెంగా తయారీకి సుమారు పదివేల గంటల సమయం పట్టింది. లేతవర్ణాలకు ప్రాధాన్యమివ్వాలనే వధువు అభిరుచి మేరకు లెహెంగా తయారీకి మీగడ, బంగారు వర్ణాలను ఎంపిక చేసుకున్నాం. సున్నితంగా అనిపించేలా జర్దోసీ వర్క్‌, చికన్‌కారీ, గోల్డ్‌ మెటల్‌ వర్క్‌తో మెరిసిపోయేలా లెహెంగాను సిద్ధం చేశాం. తలపై నుంచి జాలువారే బంగారు రంగు దుపట్టాకు పొదిగిన పగడాలతో ప్రత్యేక ఆకర్షణ వచ్చేలా చేశాం అంటారు’ అనామిక.

మిహికా లెహెంగాకి... పదివేల గంటలు
మిహికా లెహెంగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.