ETV Bharat / international

'ఉగ్రవాదంపై భారత్​-పాక్​-చైనా సంయుక్త విన్యాసాలు'

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విన్యాసాలు చేపట్టాలని షాంఘై సహకార కూటమి(ఎస్‌సీవో) నిర్ణయించింది. కూటమిలో సభ్యదేశాలైన భారత్​, పాక్​, చైనాలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరాడేందుకు ప్రణాళిక విడుదల చేసిన కూటమి.. ఈ సంస్థలకు ఆర్థిక మూలాలను అణచివేయాలని తీర్మానించింది.

author img

By

Published : Mar 21, 2021, 9:30 PM IST

India, Pak, China to participate in SCO joint anti-terrorism exercise this year
ఉగ్రవాదంపై భారత్​-పాక్​-చైనా ఉమ్మడి విన్యాసాలు

ఉగ్రవాదంపై వ్యతిరేక విన్యాసాలు చేపట్టాలని భారత్, చైనా, పాకిస్థాన్ సహా షాంఘై సహాకార కూటమి-ఎస్​సీఓలోని 8 సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ ఏడాది సంయుక్త విన్యాసాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు మార్చి 18న ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన ఉగ్రవాద నిర్మూలన సమావేశంలో సభ్య దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

2022-24 మధ్య ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాడేందుకు సభ్య దేశాలు అనుసరించాల్సిన ప్రణాళికను ఎస్​సీఓ విడుదల చేసింది. ఈమేరకు ముసాయిదాను ఆమోదించినట్లు తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు ఊతం ఇస్తున్న ఆర్థిక మూలాలను అణచివేయాలని తీర్మానించింది.

ఎస్​సీఓలో భారత్‌తో పాటు చైనా, రష్యా, కజకిస్థాన్,కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్థాన్,తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: 'ఉగ్రవాద నిర్మూలనతోనే ప్రగతివైపు అడుగులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.