ETV Bharat / city

లాక్​ డౌన్​ ప్రభావంతో పడిపోయిన మామిడి ధరలు

author img

By

Published : May 27, 2021, 11:02 AM IST

Updated : May 27, 2021, 12:41 PM IST

కరోనా మహమ్మారి మామిడి రైతుల ఆశల్ని చిదిమేసింది. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ లేదా కఠినమైన ఆంక్షలు ఉండటంతో చాలా చోట్ల మార్కెట్‌లలో కార్యకలాపాలు తగ్గిపోయాయి. కొన్ని మార్కెట్‌లు పూర్తిగా స్తంభించిపోయాయి. మూలిగేనక్క మీద తాటిపండు పడ్డట్టుగా... కరోనాకు తుపానులు తోడవడంతో, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. విదేశాలకూ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడం, చిల్లర మార్కెట్‌లు దెబ్బతినడంతో మామిడి ధరలు పడిపోయాయి.

లాక్​ డౌన్​ ప్రభావంతో పడిపోయిన మామిడి ధరలు
లాక్​ డౌన్​ ప్రభావంతో పడిపోయిన మామిడి ధరలు

మంచు, అకాల వర్షాలతో ఈసారి మామిడి పంట దిగుబడీ అంతంత మాత్రంగానే ఉంది. ఎంతోకొంత పంట చేతికొచ్చాక, దాన్ని అమ్ముకుని తెరిపిన పడదామనుకునేసరికి.. కరోనా పిడుగు పడింది. కాస్త ముందుగా మామిడి కోతకొచ్చే.. విజయనగరం, కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం వంటి చోట్ల తొలి పంటను కొంత మంచి ధరలకే విక్రయించుకోగలిగారు. కృష్ణా జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పాటు, తూర్పు, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు వంటి జిల్లాల్లో ప్రస్తుతం.. మామిడి పంట సీజన్‌ మధ్యలో ఉంది. గిరాకీ లేకపోవడంతో వచ్చిన ధరకే రైతులు మామిడి విక్రయించాల్సి వస్తోంది. పంట ఆలస్యంగా వచ్చే ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు తదితర ప్రాంతాల రైతులతో పాటు, అటు చిత్తూరు రైతులు.. వచ్చే నెల కూడా కరోనా ఉద్ధృతి తగ్గకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

కొనేవారేరీ..!

ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశం నలుమూలలకూ మామిడి ఎగుమతులు జరుగుతాయి. ముఖ్యంగా ముంబయి, దిల్లీ, ఇండోర్‌లు మన మామిడికి ప్రధాన మార్కెట్‌లు. అక్కడి నుంచి రీటెయిల్‌ మార్కెట్‌లకు, వారి నుంచి చిన్న విక్రయదారులకు మామిడి పళ్ల సరఫరా జరుగుతుంది. ఈసారి కరోనా వల్ల ఈ చైన్‌ మొత్తం దెబ్బతింది. దాదాపు ప్రతి రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఉన్నాయి. కొన్ని వర్గాలకు ఆదాయం కూడా తగ్గింది. ఇవన్నీ మామిడి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. కరోనా తొలిదశలో రవాణాకి ఇబ్బందులు ఎదురైనా... మార్కెటింగ్‌కి ఇబ్బంది రాలేదని, ఈ సీజన్‌లో రవాణాపై ఆంక్షల్లేకపోయినా కొనేవాళ్లు లేక ధరలు పడిపోయాయని కృష్ణా జిల్లాకు చెందిన మామిడి ఎగుమతిదారులు చెబుతున్నారు. ‘‘కేరళ నుంచి గుజరాత్‌ వరకు విస్తరించిన సహ్యాద్రి ప్రాంతానికి ఈ సీజన్‌లో కృష్ణా జిల్లా నుంచి రోజూ 10 వేల టన్నుల మామిడి ఎగుమతి అవుతుంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుపాను వల్ల వారం పది రోజులు సరఫరాలు నిలిచిపోయాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను కూడా ఎగుమతుల్ని దెబ్బతీస్తోంది’’ అని విజయవాడకు చెందిన మామిడిపళ్ల ఎగుమతిదారు అప్పారావు తెలిపారు.

పతనమైన ధరలు..!

కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 65-70 శాతం బంగినపల్లి రకమే పండిస్తారు. ఈ మూడు జిల్లాలో సుమారు 96 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఈ సంవత్సరం 12.23 లక్షల టన్నుల దిగుమతులు వస్తాయని అంచనా. కృష్ణా జిల్లాలో బంగినపల్లికి టన్నుకి రూ.15-20 వేల ధర లభిస్తోంది. కనీసం 30-40 వేలు ధర రావాలి. రెడ్డిగూడెం ప్రాంతంలో మార్చి నెలాఖరుకే పంట చేతికొచ్చింది. అప్పట్లో అక్కడ టన్ను రూ.50-60 వేలకూ విక్రయించారు. పిందె దశ నుంచీ సంచులు కట్టి పెంచిన పళ్లకు టన్నుకి రూ.90 వేల వరకు పలికింది. ఏప్రిల్‌ 15 నాటికి ధరలు బాగా తగ్గాయి. మే నాటికి మరింత పడిపోయాయి. ప్రస్తుతం రసాలు టన్ను రూ.8-10 వేలకు, తోతాపురి రూ.8,500 నుంచి రూ.10 వేలకు కొంటున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఇది వరకు మే నెలలో ముంబయి మార్కెట్‌కి రోజుకి 100 లారీల్లో పళ్లు పంపినా, సాయంత్రానికి అయిపోయేవి. ఇప్పుడు ఒక్కోసారి రెండుమూడు రోజులపాటు మార్కెట్‌కి సరకు పంపొద్దని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు’’ అని రెడ్డిగూడేనికి చెందిన ఎగుమతిదారు కృపారావు తెలిపారు.

కోతకొచ్చేసరికి పరిస్థితేంటో..!

కృష్ణా జిల్లా కంటే ప్రకాశం జిల్లాలో సుమారు నెల రోజులు ఆలస్యంగా మామిడి కోతకొస్తుంది. జిల్లాలో ఉలవపాడు మామిడికి పెద్ద మార్కెట్‌. గుంటూరు, విజయవాడ నుంచి వ్యాపారులు వెళ్లి, అక్కడ మామిడి కాయలు కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ ఇప్పుడిప్పుడే బంగినపల్లి మామిడి మార్కెట్‌కి వస్తోంది. ప్రస్తుతం హైవే పక్కన దుకాణాలు పెట్టి విక్రయించే వారే ఎక్కువగా కొంటున్నారు. టన్ను 30-40 వేల వరకు పలుకుతోంది. బంగినపల్లి కంటే ముందుగా వచ్చిన.. రసాలు టన్ను రూ.15-20 వేలకు, నాటుకాయలు టన్ను రూ.7-10 వేలకు విక్రయించారు. తోతాపురి రకాన్ని టన్ను రూ.10 వేలకు కొనేవారు. ఇప్పుడు దాని ధర రూ.8 వేలకు పడిపోయింది. అక్కడ మరో 10-15 రోజుల్లో మామిడి పూర్తిగా పక్వానికొస్తుంది. అప్పటికీ కరోనా ఉద్ధృతి తగ్గకపోతే తమ పరిస్థితేంటని అక్కడి రైతులు ఆందోళన చెబుతున్నారు.

పచ్చళ్ల మామిడికీ డిమాండ్‌ లేదు..!

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సుమారు 60 వేల హెక్టార్లలో మామిడి తోటలుండగా... వాటిలో ఒక్క విజయనగరం జిల్లాలోనే 33 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. అక్కడ 60 శాతంపైగా సువర్ణరేఖ రకం సాగవుతుంది. మామిడి పండ్లతో పాటు, పచ్చళ్ల కోసం పచ్చిమామిడినీ ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు వాటికీ డిమాండ్‌ లేదని రైతులు చెబుతున్నారు. ‘‘ఏప్రిల్‌ 20 వరకు మార్కెట్‌ బాగానే ఉంది. ఆ తర్వాత వరుసగా ఒక్కో రాష్ట్రంలో లాక్‌డౌన్‌లు, ఆంక్షలు పెట్టేసరికి డిమాండ్‌ తగ్గిపోయింది. ప్రస్తుతం టన్నుకి 10-12 వేలకు మించి ధర రావడం లేదు. మామిడి తాండ్ర పరిశ్రమ కూడా కష్టాల్లో ఉండటం రైతుల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఇదివరకు చిత్తూరు జిల్లాతో పాటు, సిక్కిం, నేపాల్‌ వంటి ప్రాంతాల నుంచీ మామిడి గుజ్జు ఫ్యాక్టరీల కోసం మామిడి పళ్లు కొనేందుకు వచ్చేవారు. ఇప్పుడు వాళ్లూ రావడం లేదు’’ అని విజయనగరం జిల్లా అలమండ ప్రాంతానికి చెందిన రైతు లగుడు దేముడు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమలు ముందుకొస్తాయా?..!

రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,12,189 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. వీటిలోని 67,200 హెక్టార్లలో తోతాపురి రకమే సాగవుతోంది. ఇది ప్రధానంగా మామిడి గుజ్జు, పళ్ల రసాల తయారీకి ఉపయోగిస్తారు. గత సంవత్సరం దిగుబడి తక్కువ రావడంతో స్థానికంగా ఉన్న మామిడిగుజ్జు పరిశ్రమలతో పాటు, పొరుగునే ఉన్న తమిళనాడులోని పరిశ్రమలూ ఇక్కడి నుంచే కొనుగోలు చేశాయి. అప్పట్లో తోతాపురి రకం టన్నుకి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలికింది. కరోనా ఉద్ధృతి వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లు అంత ఆశాజనకంగా లేకపోవడంతో... కొన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇవన్నీ ధరల్ని ప్రభావితం చేస్తాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ తోతాపురికి టన్నుకి రూ.9-10 వేలు ధర లభిస్తోంది.

బేనిషా.. పరేషాన్‌..!

రాయలసీమ మేలురకం బంగినపల్లి మామిడికి ప్రసిద్ధి. బంగినపల్లిని స్థానికంగా బేనిషా అని పిలుస్తారు. ఇక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు మామిడి ఎగుమతులు ఎక్కువ జరిగేవి. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో ధరలూ తగ్గిపోయాయి. ఇది వరకు బేనిషాకి టన్నుకి రూ.30 వేలకుపైనే ధర పలికేది. ఇప్పుడు నాణ్యమైన పళ్లకు రూ.20-23 వేలు రావడమే గగనమవుతోంది. హెక్టారుకి పది టన్నుల వరకు దిగుబడి రావలసి ఉండగా, ఈసారి రెండున్నర నుంచి మూడు వేల టన్నులే వచ్చిందని రైతులు చెబుతున్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఇక్కడి మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది.

ఇదీ చదవండి: Etela: ఈటలతో ఆ ముగ్గురు నేతల భేటీ

Last Updated : May 27, 2021, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.