బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని ముంబై ఎన్సీబీ అధికారులు.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో.. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఆ కేసులో ఇప్పటికే ముంబై ఎన్సీబీ (NCB) అధికారులు పలువురిని విచారించగా గతంలో సిద్దార్ధ్ పితాని అనే వ్యక్తిని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.
drugs case: డ్రగ్స్ కేసులో సుశాంత్‌సింగ్ స్నేహితుడు అరెస్ట్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోకరిని అరెస్టు చేసింది ముంబై ఎస్సీబీ. సిద్దార్థ్ పితాని అనే వ్యక్తిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ముంబై ఎస్సీబీ.. ట్రాన్సిట్ వారంట్ పరారీపై ముంబై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.
![drugs case: డ్రగ్స్ కేసులో సుశాంత్‌సింగ్ స్నేహితుడు అరెస్ట్ బాలీవుడ్ డ్రగ్స్ కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11938381-221-11938381-1622230643866.jpg?imwidth=3840)
విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో అతని కోసం ఓ ప్రత్యేక బృందం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. ఎన్సీబీ అధికారులు స్థానిక పోలీసుల సాయతో సిద్దార్ధ్‌ని.. గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబై తీసుకువెళ్ళిన అధికారులు... ముంబై కోర్టులో హాజరుపర్చగా జూన్ 1 వరకు విచారణకు అనుమతించింది.
ఇవీ చూడండి: Covaxin Timeline: టీకా తయారీకి ఎన్ని రోజులు?