ETV Bharat / business

ఒరాకిల్​ కాపీ రైట్​ వివాదంలో గూగుల్​కు ఊరట

author img

By

Published : Apr 6, 2021, 12:49 PM IST

Updated : Apr 6, 2021, 6:28 PM IST

గూగుల్​, ఒరాకిల్​ మధ్య ఆండ్రాయిడ్​ ఓఎస్​ కోడింగ్ వివాదంలో అమెరికా సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒరాకిల్​కు చెందిన జావా కోడ్​ను సహేతుక ప్రయోజనాల కోసం వినియోగించినందున.. గూగుల్​ కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పలేమని పేర్కొంది.

Google win in copy right issue with Oracle
గూగుల్ ఒరాకిల్ కాపీ రైట్​ వివాదం

ఒరాకిల్​తో కాపీరైట్ కేసులో గూగుల్​కు ఊరట లభించింది. 'ఆండ్రాయిడ్‌' ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) కోడ్‌ విషయంలో ఇరు సంస్థల మధ్య తలెత్తిన వివాదంలో అమెరికా సుప్రీం కోర్టు గూగుల్‌ వైపు నిలిచింది.

ఆండ్రాయిడ్ కోసం తమ కోడ్​ కాపీ కొట్టినట్లు ఒరాకిల్‌ చేసిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ వివాదంలో న్యాయమూర్తులు 6- 2 నిష్పత్తిలో గూగుల్‌కు అనుకూలంగా నిలిచారు. గూగుల్‌ ఆ కోడ్​ను సహేతుక ప్రయోజనం కోసం వినియోగించిందని.. అందువల్ల ఈ చర్య కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పలేమని న్యాయమూర్తి జస్టిస్‌ స్టీఫెన్‌ బ్రేయర్‌ అభిప్రాయపడ్డారు.

వివాదం ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా మొబైల్​ ఫోన్లలో అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్​కు సంబంధించి గూగుల్, ఒరాకిల్​ మధ్య గత పదేళ్లుగా వివాదం కొనసాగుతోంది.

2007లో విడుదలైన ఆండ్రాయిడ్ ఓఎస్​ కోసం మిలియన్ల కోడింగ్ లైన్లను రాసింది గూగుల్. అయితే అందులో 11,330 లైన్ల కోడింగ్​ను తమకు చెందిన జావా ప్లాట్​ఫామ్​ నుంచి తీసుకున్నట్లు ఒరాకిల్ ఆరోపించింది. తమ కోడింగ్​ను.. చట్టవిరుద్ధంగా వినియోగించుకుందని గూగుల్​పై 8 బిలియన్ డాలర్ల దావా వేసింది.

అయితే ఇది టెక్​ పరిశ్రమలో సాధారణంగా జరుగుతున్న ప్రక్రియేనని, ఉత్తమ సాంకేతకతను రూపొందించేందుకు ఇది మంచిదేనని గూగుల్ తన చర్యను సమర్థించుకుంది.

ఇదీ చదవండి:హెచ్​డీ సెట్​-టాప్​ బాక్స్​లపై టాటా స్కై ఆఫర్ల మేళ!

Last Updated : Apr 6, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.