ETV Bharat / bharat

మహిళను రేప్​ చేసి... వీడియోతో బెదిరించి...

author img

By

Published : Mar 4, 2021, 5:02 PM IST

ఓ మహిళపై ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా పట్టణంలో జరిగింది. ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటన.. బాధితురాలి ఫిర్యాదుతో బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

up woman, rape
యూపీ​లో మహిళపై అత్యాచారం.. ముగ్గురు అదుపులోకి

ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా పట్టణంలో ఓ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల క్రితం ముగ్గురు యువకులు బాధిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం నాడు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించాక ఈ విషయం బయటపడింది. అఘాయిత్యం చేస్తూ తీసిన వీడియోతో నిందితులు తనను బ్లాక్​మెయిల్​ చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

"గతేడాది అక్టోబరు 8న నేను మహోబాకు వచ్చాను. అదే రోజు ముగ్గురు దుండగులు నన్ను ఓ ఇంట్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ఈ ఘటనకు సంబంధించి వీడియోను రికార్డ్​ చేశారు. నా దగ్గర అప్పుడు ఉన్న 1.5 లక్షలు నగదు, బంగారు గోలుసును తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత కూడా ఘటనకు సంబంధించిన వీడియోతో బెదిరించి నాపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు."

-బాధితురాలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండి : కూతుర్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.