ETV Bharat / bharat

ఇది 'శాకాహారుల మటన్'.. కిలో రూ.400- 500​!

author img

By

Published : Jul 4, 2020, 10:50 AM IST

సాధారణ పుట్టగొడుగులు ఎప్పుడైనా, ఎక్కడైనా దొరుకుతాయి. కానీ, అరుదైన రుగ్డా, కుక్డీ పుట్టగొడుగులు మాత్రం మేఘాలు గర్జించినప్పుడు మాత్రమే మొలకెత్తుతాయి. వానాకాలం వచ్చిందంటే చాలు.. ఝార్ఖండ్​ అడవుల్లో లభించే ఈ పుట్టగొడుగుల కోసం అటు మాంసాహారులు, ఇటు శాకాహారులు తెగ ఎగబడతారు. అంతలా ఆకట్టుకునే ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత ఏంటి?

'Rugda and Khukdi'- The vegetarian mutton of Jharkhand
ఆ పుట్టగొడుగుల కోసం జనం ఎగబడుతారు!

ఇది 'శాకాహారుల మటన్'.. కిలో రూ.400- 500​!

అడవి తల్లి తన ఒడిలో ఎన్నో అరుదైన ఖనిజాలు దాచుకుంది. వాటిలో రుగ్డా, కుక్డీ పుట్టగొడుగులు ఒకటి. తొలకరి జల్లులు కురవగానే ఝార్ఖండ్​​ సుఖవా వనాల్లో విరివిగా విరబూస్తాయీ అరుదైన పుట్టగొడుగులు. సంపూర్ణ పోషకాలు కలిగిన ఈ రుగ్డా, కుక్డీల రుచికి ఏదీ సాటిలేదు. అచ్చం మేక మాంసం రుచిని తలపించే ఈ పుట్టగొడుగులు 'శాకాహారుల మటన్​'గా పేరుగాంచాయి.

మటన్​తో సమానం..

చిన్న బంగాళదుంపల్లా కనిపించే ఈ రుగ్డా, కుక్డీలు తెలుపు, నలుపు రంగుల్లో దొరుకుతాయి. వానాకాలంలో మాత్రమే పండే ఈ పుట్టగొడుగులను గిరిజనులు సేకరించి రాజధాని రాంచీ సహా ఇతర నగరాల్లో వ్యాపారులకు విక్రయిస్తారు. మటన్ రుచిని కలిగి ఉండడమే కాదు, మటన్​​తో సమానంగా దాదాపు కిలో రూ.400 నుంచి రూ.500లు ధర పలుకుతాయి.

"వర్షాకాలంలో అడవిలో పూస్తాయి ఈ పుట్టగొడుగులు. మేఘాలు ఉరిమినప్పుడు ఈ రుగ్డాలు మొలకెత్తుతాయి. పుట్టగొడుగులు తవ్వి తెచ్చిన వారి వద్ద కిలో రూ.350కి కొంటాం. మట్టిని అంతా శుద్ధి చేసి, రూ.400 కిలో చొప్పున విక్రయిస్తాం. ఇవి ఝార్ఖండ్​ వాసులకు ఎంతో ఇష్టం"

-రుగ్డా విక్రేత, రాంచి

కరోనా నుంచి కాపాడతాయి!

ఈ రకం పుట్టగొడుగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు వైద్యులు. ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్​, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కావున రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వీటిని తినడం వల్ల సత్ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు, ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ రుగ్డా, కుక్డీ పుట్టగొడుగులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు వైద్యులు.

ఝార్ఖండ్​ రాష్ట్రమంతా తెగ ఇష్టపడి తినే ఈ ఫేమస్ రుగ్డా, కుక్డీలు.. ఇప్పటివరకు అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల అధికారిక జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ అరుదైన పుట్టగొడుగులకు గుర్తింపు కల్పిస్తే యావత్​ దేశం, ప్రపంచం వీటి నుంచి లాభాలు పొందుతాయంటున్నారు నిపుణులు.

ఇదీ చదవండి: ఆ బియ్యం రుచి, రంగు, వాసన అచ్చం చాక్లెట్​లానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.