ETV Bharat / bharat

'భారత్​-ఆసియాన్​ కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం'

author img

By

Published : Nov 12, 2020, 5:21 PM IST

వియాత్నాం ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ ఆసియాన్​ సదస్సులో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని మోదీ. భారత్​- ఆసియాన్​ దేశాల మధ్య అనుసంధానత పెంచడమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భద్రత, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు ఆసియాన్​ బృందం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

Enhancing every type of connectivity between India and ASEAN is a major priority for us: PM Modi
'భారత్​- ఆసియాన్​ కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం'

భారత్​-ఆసియాన్​ దేశాల మధ్య అన్ని విధాలుగా అనుసంధానతను పెంచడమే తమ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలో భద్రత, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు బాధ్యతాయుతమైన ఆసియాన్​ అవసరం ఉందన్నారు. 17వ ఆసియాన్​ సదస్సులో వర్చువల్​గా పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండో-పసిఫిక్​ ప్రాంతం పట్ల భారత దేశ ఆలోచనలు, ఆ ప్రాంతంపై ఆసియాన్​ దృక్పథం ఒకే విధంగా ఉందని పేర్కొన్నారు ప్రధాని. తొలినాళ్ల నుంచే భారత "యాక్ట్​ ఈస్ట్​ పాలసీ"లో ఆసియాన్​ బృందం కీలక పాత్ర పోషించిందన్నారు.

కూటమిలో...

వియాత్నాం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆసియాన్​ సదస్సు జరుగుతోంది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కాంబోడియా. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు సభ్య​ దేశాలుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:- 'మోదీ నిర్ణయాల వల్లే ఆర్థిక మాంద్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.