ETV Bharat / bharat

కరోనా సోకిన 'జర్నలిస్ట్'​పై కేసు నమోదు

author img

By

Published : Mar 28, 2020, 10:36 AM IST

మధ్యప్రదేశ్​లో అప్పటి ముఖ్యమంత్రి కమల్​నాథ్​ మీడియా సమావేశానికి హాజరైన ఓ పాత్రికేయుడిపై కేసు నమోదు చేశారు. కరోనా సోకినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి కార్యక్రమానికి వచ్చినందు వల్ల అతనిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు.

Coronavirus: Scribe booked for attending ex-CM's presser after daughter's return from UK
కరోనా సోకిన 'జర్నలిస్ట్'​పై కేసు నమోదు

మధ్యప్రదేశ్​లో కరోనా సోకిన ఓ పాత్రికేయుడు మార్చి 20న అప్పటి ముఖ్యమంత్రి కమల్​నాథ్​ మీడియా సమావేశానికి హాజరైనందు వల్ల ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల లండన్​లో న్యాయశాస్త్రం చదువుతున్న జర్నలిస్ట్​ కుమార్తె భారత్​కు వచ్చింది. ఈ క్రమంలోనే గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ వినకుండా మీడియా సమావేశానికి హాజరయ్యారు ఆ జర్నలిస్ట్​. ఈ కార్యక్రమం జరిగిన కొన్ని రోజుల తర్వాత పాత్రికేయుడితో పాటు ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయ్యింది.

ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్​పై భోపాల్​ శ్యామ్లా హిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​ 188(ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన), 269(ప్రాణాంతక వ్యాధిని నిర్లక్ష్యం చేయడం), 270ల కింద కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా.. ప్రభుత్వం ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు.

33 కరోనా కేసులు

రాష్ట్రంలో ఇప్పటివరకు 33 కరనా కేసులు నమోదయ్యాయి. అందులో అధికంగా ఇండోర్​లో 16 మందికి వైరస్​ సోకింది. వీరిలో ఇడోర్​, ఉజ్జయిని ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్​ ధాటికి మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.