ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత మహిళల జట్టు. ఇప్పుడు క్లీన్ స్వైప్‌పై కన్నేశారు అమ్మాయిలు. ముంబయి వాంఖడేలో గురువారం ఇంగ్లండ్‌తో మూడో వన్డే ఆడనుంది మిథాలీ సేన.
తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 7 వికెట్లతో విజయాన్ని అందుకున్న మిథాలీ సేన 2021 ప్రపంచ కప్‌కు అర్హతను పటిష్టపరుచుకుంది. క్లిష్ట సమయంలో నాలుగు పాయింట్లు సాధించి రేసులో నిలిచింది. తుది బెర్త్ కోసం మరో రెండు పాయింట్ల సాధించాల్సిన తరణంలో బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేయకపోవచ్చు.
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా రెండో వన్డేలో 63 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించింది. మరో పక్క కెప్టెన్ మిథాలీ రాజ్ 44, 47 పరుగులతో నిలకడగా రాణిస్తోంది. వీరిద్దరితో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. పూనమ్ రౌత్ మిడిల్ ఆర్డర్లో ఆక్టటుకుంటోంది. మరో ఓపెనర్ జెమ్మీ రోడ్రిగ్స్‌తో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
బౌలింగ్‌లోనూ అమ్మాయిల జట్టు బలంగా ఉంది. రెండు మ్యాచ్‌ల్లోనూ జులన్ గోస్వామి(5వికెట్లు), షికా పాండే(6) ప్రత్యర్థిపై నిప్పులు చెరిగారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్‌లతో మహిళల స్పిన్ దళం పరిపూర్ణంగా ఉంది. ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో గువహటీలో మూడు టీ 20లు ఆడనుంది మిథాలీసేన.
భారత మహిళల జట్టు:
మిథాలీ రాజ్(కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా(వికెట్ కీపర్), ఆర్ కల్పన, మోనా మేష్రమ్, ఏక్తా భిష్త్, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, షికా పాండే, మాన్సి జోషి, పూనమ్ రౌత్, హర్లీన్ డియోల్.
ఇంగ్లండ్ మహిళల జట్టు:
హెథర్ నైట్(కెప్టెన్), టామి బెమౌంట్, కేథరిన్ బ్రంట్,కేట్ క్రాస్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్. జార్జియా ఎల్విస్, అలెక్స్ హార్ట్లీ, అమీ జోన్స్, లారా మార్ష్, న్యాట్ స్కైవర్, ఆన్యా ష్రూబ్సోల్, సారా టేలర్(వికెట్ కీపర్), లోరెన్ విన్ఫీల్డ్, డానీ వ్యాట్.
మూడో వన్డే గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.