Students Celebrations in SV Veterinary university: వీసీ రిటైర్మెంట్.. సంబరాలు చేసుకున్న విద్యార్థులు - SV Veterinary University Tirupati
🎬 Watch Now: Feature Video
Students Celebration because of VC Retired in SV Veterinary University Tirupati: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి పద్మనాభరెడ్డి పదవీకాలం ముగిసిందని యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయమైన శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విద్యాలయ ఉపకులపతిగా పద్మనాభ రెడ్డి మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. పదవీకాలం పూర్తయిన ఆయనను బాధ్యతల నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ఇంఛార్జ్ ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ నాయకులు పశువైద్య విశ్వవిద్యాలయ పరిపాలన భవనం మీదట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పద్మనాభ రెడ్డి పాలనలో విశ్వవిద్యాలయం అస్తవ్యస్తంగా మారి విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కావని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. మూడేళ్లగా పద్మనాభ రెడ్డి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదని ఆరోపించారు. ఆయన మారిపోవాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నామని.. కోరిక నెరవేరినందుకే సంబరాలు చేసుకుంటున్నామన్నారు.