Sarpanch Fire On AP Government : 'పంచాయతీల నిధుల దారి మళ్లింపు'.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సర్పంచుల ఆగ్రహం.. - కేంద్రం నిధులు దారిమళ్లుతున్నాయని మండిపాటు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 7:47 PM IST
Sarpanch Fire On AP Government : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు... పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని మండిపడ్డారు. నిధులు మళ్లించడంతో తాగునీరు మురుగు కాల్వలు శుభ్రత వంటి కనీస పనులు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతి నుంచి లక్షల రూపాయల పెట్టి అభివృద్ధి పనులు చేస్తే అరకొరగా వచ్చిన నిధులకు షరతులు పెట్టడంపై ధ్వజమెత్తారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వ పాఠశాల్లో ప్రథమ పౌరులకు కనీసం ఆహ్వానం లేదని విద్యాధికారుల పై మండిపడ్డారు. సర్పంచులు పంచాయతీ నిధులపై నిలదీయడంతో.. అధికారులు సమాధానం చెప్పలేక రాతపూర్వకంగా రాసి ఇస్తే ప్రభుత్వానికి పంపుతామన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.