Minister Peddireddy on elections వచ్చే ఎన్నికల్లో 150 పైగా సీట్లు గెలుస్తాం..: మంత్రి పెద్దిరెడ్డి - Minister Peddireddy bout Alliances
🎬 Watch Now: Feature Video
Minister Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. రానున్న ఎన్నికల్లో తాము 150 సీట్లకు పైగా సాధించి గెలుస్తామని.. అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురంలోని రూరల్ నాగిరెడ్డిపల్లి గ్రామంలో గ్రీన్ హూడ్స్ రిసార్ట్లో వైసీపీ జేసీఎస్ మండల కన్వీనర్లకు, వైయస్సార్ పీపుల్స్ సర్వేలో జిల్లా మొదటి స్థానం పొందిన సందర్భంగా మంత్రి వారిని సన్మానించారు. ఎన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చినా.. వైసీపీ ఒంటరిగానే బరిలో ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సహకారంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమంగా ఉండాలని తమకు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయంగా పరిజ్ఞానం లేని వ్యక్తి లోకేశ్ అని అతని గురించి మాట్లాడలేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన స్థానంలో మొదట గెలిచేలా చూసుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే బరిలో నిలిచి 150 సీట్లకు పైగా సాధిస్తుందని, మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంత మంది కలిసి పోటి చేసినా.. తమకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలే.. ప్రజల్లో ఏ పార్టీపై అభిమానం ఉందన్న విషయాన్ని తెలియజేస్తాయని పెద్దిరెడ్డి వెల్లడించారు.