బిడ్డ అదృశ్యంపై తల్లి ఆందోళన - వీడియో వైరల్​ కావడంతో స్పందించిన పోలీసులు - సోషల్ మీడియాలో వైరల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 3:37 PM IST

Boy Was Missing In Government Hospital In Nellore: నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. నగరంలోని రామకోటయ్య నగర్​లో నివసిస్తున్న తిరుపతమ్మ అనే మహిళ అనారోగ్యంతో గత పదిరోజులుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సన్ని అనే నాలుగేళ్ల కుమారుడు తనతో పాటు ఆసుపత్రి వద్దే ఉంటున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ రోజు నుంచి తన బాబు కనిపించడంలేదని తల్లి చెబుతోంది. 

బిడ్డను తన వద్దకు చేర్చాలని కోరుతూ హాస్పటల్ బయటే ఆ తల్లి నిరీక్షిస్తోంది. ఓ పాస్టర్ తన దగ్గరకు వచ్చి బిడ్డను అడిగినట్లు తిరుపతమ్మ చెబుతోంది. అందుకు తాను అంగీకరించకపోవడంతో బాబును అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. తన బాబు కనిపించడం లేదని స్థానిక పోలీసుకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాలుడి అపహరణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత మహిళ వద్దకు వచ్చిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తన బాబును అప్పగించాలని ఆ తల్లి వేడుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.