లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొరుగు సేవల ఉద్యోగులకు కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్య కళావతి నిత్యావసర వస్తువులను అందజేశారు. సుమారు 50 మందికి నిత్యావసర సరకులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పొరుగు సేవల ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కళావతి తెలిపారు. ఈ మేరకు వారికి నిత్యావసర సరకులను అందజేశామని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి