ETV Bharat / state

సీఎం సొంత జిల్లాలో దారుణం.. సామాన్యుడిపై హత్యాయత్నం

MPP Raghunatha Reddy Attack on Farmer: అతడో సామాన్య రైతు.. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సమాజంలో జరుగుతున్న అవినీతి, రాజకీయ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. లోకాయుక్త, హైకోర్టులను ఆశ్రయించి న్యాయం పోరాటం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యమే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది. స్థానిక వైసీపీ నాయకుల అవినీతిపై ఫిర్యాదు చేయగా.. సినిమా స్టోరీని తలపించేలా పాయింట్ బ్లాంక్​లో గన్ పెట్టి బెదిరించారు. అంతటితో ఆగకుండా అతడి తల్లి, భార్యపై దాడి చేసి గాయపర్చారు. ఇనుప రాడ్​తో దాడి చేయడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీఎం సొంత జిల్లా కడపలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలివీ...

Attempt to kill common man in CM's own district
సామాన్యుడిపై హత్యాయత్నం..
author img

By

Published : Jan 20, 2023, 6:49 PM IST

MPP Raghunatha Reddy Attack on Farmer : అన్యాయంపై ప్రశ్నించినందుకు, అక్రమాలను వెలికి తీసినందుకు తనపై వీరపునాయునిపల్లి ఎంపీపీ రఘునాథరెడ్డి దాడి చేశారని రైతు, అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న నాగప్రసాద్ వాపోయాడు. తుపాకీతో బెదిరించి, అనుచరులతో కలిసి గాయపరిచాడని తెలిపాడు. వైఎస్సార్​ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలో ఎంపీపీ రఘునాథరెడ్డి, అతడి అనుచరులు సాగిస్తున్న అక్రమాలు అనేకం అని తెలిపాడు. ఆన్​లైన్​ ప్రక్రియను అడ్డం పెట్టుకుని, తహసీల్దార్​తో కుమ్మక్కై గుట్టలు అన్యాక్రాంతం చేస్తున్నాడని, భూములు చెరబట్టారని వివరించాడు. ఇసుక అక్రమ రవాణా కుంభకోణం పెద్ద ఎత్తున సాగుతోందని చెప్పాడు. ఎంపీపీ హోదాలో అవినీతికి పాల్పడడంతో పాటు.. బొగ్గు బట్టీలు నడుపుతున్నాడని తెలిపాడు. ఈ మేరకు ప్రొద్దుటూరు సరోజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగప్రసాద్.. అవుట్ పోస్ట్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

సామాన్యుడిపై హత్యాయత్నం..

ఎంపీపీ కుంభకోణాలు వెలికితీస్తున్న తనపై.. హత్యాయత్నానికి పాల్పడ్డారు. గన్​తో చంపడానికి ప్రయత్నించి.. దొరికిపోతాననే భయంతో రాడ్డుతో చంపాలని ప్రయత్నించారు. -నాగప్రసాద్, బాధితుడు

భూములను దక్కించుకునేందుకు అసైన్​మెంట్​ కమిటీలో తనకు ఇష్టం వచ్చినట్లు ఎంపీపీ వ్యవహరిస్తున్నారని, ఆయనతోపాటు శివాంజనేయరెడ్డి, అనిమల శ్రీనివాసులురెడ్డి, బుసిరెడ్డి రామాంజనేయులు రెడ్డి సహా మరి కొందరు అనుచరులందరూ తన ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నాడు. మహిళలను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో మాట్లాడి తన తల్లి, చెల్లెలిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికైనా అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని విన్నవించాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.