కడప జిల్లా జమ్మలమడుగు-ముద్దనూరు మధ్యలో ఉన్న పెన్నా వంతెన కుంగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వంతెన మధ్యలో కుంగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు.. సిబ్బందితో కలిసి వెంటనే వంతెన వద్దకు చేరుకొని రాకపోకలను నిలిపివేశారు.
2008 డిసెంబర్ 4న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని ప్రారంభించారు. 13 ఏళ్లకే వంతెన కూలిపోయే స్ధితికి చేరుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కింద ఉన్న ఇసుకను అక్రమంగా రవాణా చేయడమే.. కుంగిపోవడానికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: