వేసవి సెలవుల సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ క్రీడా మైదానంలో క్రీడల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ అథ్లెటిక్స్‌తో పాటు వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి రమణ రాజు తెలిపారు. బాలబాలికలు వివిధ క్రీడల్లో శిక్షణ తీసుకొని పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి క్రీడా శిబిరంలో పాల్గొనేందుకు విద్యార్థులు, చిన్నారులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
ఇవీ చూడండి : ఫొని తుపాను బాధితులను ఆదుకోండి: చంద్రబాబు