బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలతో కడప జిల్లాలోని కుందు నది జలకళను సంతరించుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ప్రారంభమయ్యే ఈ నదికి అటు కర్నూలు జిల్లాలోను, ఇటు కడప జిల్లాలోను కురిసిన వర్షాలతో పరివాహక ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరింది. దాదాపు మూడు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నిన్నటి వరకు వెలవెలబోయిన కుందునది నేడు నీరు ప్రవహించడంతో పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడినట్లయింది. వేసవి కాలం అనంతరం తొలిసారిగా వర్షపు నీరు చేరడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఇవీ చూడండి:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు