seven year old boy complained to collector : అమ్మ నాన్న వదిలేసి వెళ్లిపోయారు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. న్యాయం చేయాలంటూ ఏడేళ్ల బాలుడు కడప కలెక్టరేట్‌కు వచ్చాడు. ఈ వయసులో బాలుడు న్యాయం కోసం రోడ్డు ఎక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వైఎస్సార్ జిల్లా వేంపల్లికి చెందిన భర్త భార్యను వదిలేసి వెళ్లిపోవడంతో భార్య ఉన్న బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో బిడ్డ అనాథ అయ్యాడు. వారిద్దరు ఎవరి దారిన వారు వెళ్లిపోవడం, చూసేందుకు ఎవరూ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులలో ఆ బాలుడు న్యాయం కోసం కడప కలెక్టరేట్‌కు వచ్చాడు.
ఆ సమయానికి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ వద్ద ఒంటరిగా సంచరిస్తుండగా అదే సమయానికి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బాలుడిని దగ్గరికి తీసుకొని విచారించాడు. అప్పుడు బాలుడు జరిగిన విషయాన్ని ఎస్ఐకి చెప్పడంతో ఆయన వెంటనే స్పందించి.. ఆ బాలుడికి ఓ కానిస్టేబుల్ ఇచ్చి పంపి వేంపల్లిలో ఉన్న తన తాత దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి వెళితే వారి భవిష్యత్తు ఏమవుతుందనేది ఒకసారి ఆలోచించాలని ఎస్సై సూచించారు.
హృదయాలను తాకిన బాలుడి మాటలు : 'నాన్న అమ్మను వదిలేసి వెళ్లిపోయాడు. అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఏమి చేయాలో అర్థం కావట్లేదు ..నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. ఏమి చేయాలో తెలియక నాకు న్యాయం జరుగుతుందని.. కలెక్టర్ సర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చాను. కలెక్టర్‌గారు లేరని చెప్పడంతో.. ఎలాగైనా కలెక్టర్ సర్‌ను కలిసే వెళ్దామని ఇక్కడే ఉన్నాను' అని ఏడేళ్ల బాలుడు చెప్పిన మాటలు అక్కడ ఉన్న అందరి హృదయాలను కలచివేసింది.
ఇవీ చదవండి :