రాజధానుల సందిగ్ధం నేపథ్యంలో రాయలసీమ నేతలు హైపవర్ కమిటీకి లేఖ రాశారు. గంగుల ప్రతాప్ రెడ్డి, మైసురారెడ్డి, శైలజానాథ్ రెడ్డి, చెంగారెడ్డిలు లేఖపై సంతకాలు చేశారు. రాజధానిపై వేసిన కమిటీలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్లే సిఫార్సులు చేశాయని లేఖలో పేర్కొన్నారు. తెలుగుజాతి కోసం తమ ప్రాంత ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. త్యాగాలు, మనోభావాలు, ఆత్మగౌరవం అనే పదాలు జీఎన్‌రావు, బోస్టన్ కమిటీలకు తెలియవని అన్నారు.
ఇదీ చదవండి: వైఎస్ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు