ETV Bharat / state

ఆప్తుల కోసం కడప కేంద్ర కారాగార ఖైదీల ఎదురు చూపులు - కడప తాజా వార్తలు

కరోనా మహమ్మారి ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేసింది. కొందరికి ఉపాధి అవకాశాలు పోగొడితే... మరికొందరికి రక్త సంబంధీకులను దూరం చేసింది. క్షణికావేశంలో నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఆప్తులను కలుసుకునే భాగ్యాన్ని కలగడం లేదు. అలాంటి వారెందతో కడప కేంద్ర కారాగారంలో మనో వేదనతో దారి వంక చూస్తున్నారు.

Kadapa Central Jail
కడప కేంద్ర కారాగారంలో ఆప్తుల కోసం ఖైదీల ఎదురు చూపులు
author img

By

Published : Jan 8, 2021, 11:45 AM IST

కడప కేంద్ర కారాగారంలో రాయలసీమ జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఖైదీలు వివిధ రకాల నేరాలపై శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం కారాగారంలో 750 మంది ఉన్నారు. ఖైదీలను చూసేందుకు నెలకు రెండుసార్లు, రిమాండ్ ఖైదీలను చూసేందుకు వారానికి రెండు సార్లు అనుమతిస్తారు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి కేంద్ర కారాగారంలో ములాఖతులు రద్దు చేశారు.

మార్చి నుంచి ఇప్పటివరకు కారాగారంలోని... తమ వారిని చూసే అవకాశం ఖైదీలకు లేకుండా పోయింది. తెలియక కారాగారం వద్దకు వస్తున్న చాలా మందిని జైలు సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. ఆప్తులను కలుసుకోలేక అటు ఖైదీలు... ఇటు వారి బంధువులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

కొన్నేళ్ల నుంచి జైల్లో ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో ఖైదీలు కరోనా సమయంలో బంధువులతో మాట్లాడి కాస్త కుదుట పడుతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకు ములాఖత్​లు లేవని అధికారులు తెలుపుతున్నారు. ఫోన్ ద్వారా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ములాఖతులకు అనుమతిస్తామని జైలు అధికారి రవి కిరణ్ వివరించారు.

ఇదీ చదవండీ...ప్రకాశం ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు... డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.