కడప జిల్లా రాయచోటి సమీపంలోని చిత్తూరు రింగ్ రోడ్డు కూడలి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వీరబల్లి మండలం పిచ్చిగుంటపల్ల్లికి చెందిన వెంకటేశ్(23) మృతి చెందాడు. పీలేరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం లారీని ఓవర్టేక్ చేస్ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి