ETV Bharat / state

సీఎం సొంత జిల్లాలో.. చివరి మజిలీకి చింతలెన్నో..? - వైఎస్సార్​ జిల్లా తాజా వార్తలు

BURIAL GROUND: అదో జిల్లా హెడ్‌క్వార్టర్స్.. శ్మశానవాటికలన్నీ మాత్రం హౌస్‌ఫుల్. ఎవరైనా కాలం చేస్తే.. శవాన్ని పూడ్చేందుకూ.. స్థలం లేదు. ఉన్న సమాధుల్నే తవ్వి.. పూడ్చాల్సిన పరిస్థితి. ఇక.. కబ్జాదారుల సంగతి చెప్పాల్సి పనిలేదు. శ్మశానాలపైనా కన్నేసి చాలామందికి కన్నీటిని మిగిలిస్తున్నారు.. ఇదీ.. సీఎం సొంత జిల్లా కేంద్రం వైఎస్సార్​లోని కాటికాడ కష్టాలు.

BURIAL GROUND
BURIAL GROUND
author img

By

Published : Jul 30, 2022, 6:25 AM IST

BURIAL GROUND: కడప జనాభా దాదాపు 4 లక్షలు. మరి అందుకు తగ్గట్టుగా శ్మశానాలు అందుబాటులో ఉన్నాయా అంటే.. లేవంటున్నారు ఇక్కడి ప్రజలు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో 40 శ్మశాన వాటికలున్నాయి. ఇందులో 22 హిందూ, 13 ముస్లిం, 5 క్రిస్టియన్ శ్మశానవాటికలు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్నది సహా మోచంపేట, అశోక్ నగర్, కొండాయపల్లి, S.V. డిగ్రీ కళాశాల, మాచుపల్లి రోడ్డు శ్మశానవాటికలు సమాధులతో నిండాయి. 40 శ్మశాన వాటికల్లో నగర శివారు ప్రాంతాల్లో 13 మిగిలినవి జనావాసాల మధ్య ఉన్నాయి. 15 వాటికల్లో పరిస్థితి అత్యంత సమస్యాత్మకం.

కడప ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో హిందూ శ్మశానవాటిక దాదాపు ఆరెకరాల్లో ఉంది. అందులో రెండెకరాలు ఆక్రమణలో ఉండటం వల్ల ఇబ్బందులు తప్పట్లేదు. రాజంపేట బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికదీ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితికి కబ్జాదారులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

కడప శ్మశానవాటికల్లో స్థల సమస్య పరిష్కారానికి కొత్తగా వచ్చిన కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాత సమాధుల్ని తొలగించి మృతిచెందిన వారి వివరాలను ఒక స్థూపంపై రాయించేలా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. సున్నితమైన అంశం కావడం వల్ల అధికారుల చర్యలు ఏ మేరకు ఫలిస్తాయన్నది త్వరలో తెలుస్తాయని జనం అంటున్నారు.

కడపలో సమాధులతో నిండిన శ్మశానవాటికలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.