కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ ఆలయ సమీపంలో దారుణం జరిగింది. ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన కొత్తూరు నాగరాజు(35)హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా సమాచారం. సంఘటనా స్థలం వద్ద కారు ఉంది. అందులో లభించిన డైరీ ఆధారంగా నాగరాజు అద్దెకు కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. 29వ తేదీన కాణిపాకం, 30న బ్రహ్మంగారిమఠం అని డైరీలో రాసుకోవడంతో.. కాణిపాకం నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. కారులో ఎవరు ప్రయాణించారు, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి అనే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి