విశాఖ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం కడపజిల్లా కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. విశాఖ ఘటన దురదృష్టకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ సంఘటనలో మృతిచెందిన కుటుంబాలకు వైకాపా తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి... మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా రూ.కోటి ప్రకటించడం గర్వించదగ్గ విషయం అన్నారు.
ఇవీ చదవండి...'తినడానికి తిండి లేకుంటే.. మీకు మద్యం కావాలా..?'