మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి హెచ్చరించారు. వారి ఇబ్బందులకు పరిష్కారాన్ని కోరుతూ.. కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని.. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. 2020 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో వంట గది, పాత్రలు, గ్యాస్ సిలిండర్లు సమకూర్చాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు.
ఇదీ చదవండి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా
ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం.. కడప కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ 48 గంటల పాటు ధర్నా చేపట్టారు. రేపు ఉదయం 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: