కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్ తొలగింపునకు వచ్చిన.. మున్సిపల్ కమిషన్ ఎన్. రాధపై కూరగాయల వ్యాపారులు దాడికి ప్రయత్నించారు. మున్సిపల్ అధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ... వ్యాపారులు దాడికి తెగబడ్డారు. వారిబారి నుంచి కాపాడుకునేందుకు మున్సిపల్ కమిషనర్ రాధ పరుగులు పెడుతూ.. శివాలయం సెంటర్లోని ఓ దుకాణంలోకి వెళ్లి షట్టర్ వేసుకున్నారు.
ఈ ఘటనపై ఆగ్రహించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు.. మార్కెట్లో దాడికి యత్నించిన కూరగాయల వ్యాపారులపై ప్రతి దాడి చేశారు. దాడి.. ప్రతిదాడులతో మార్కెట్ రణరంగంగా మారింది. పోలీసులు ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ ఘర్షణను నిలువరించలేకపోయారు. చాలాసేపటికి కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఇదీ చదవండి: