కడప జిల్లాలోని సోమశిల వెనుక జలాల్లో చేపల అక్రమ వేట జరుగుతోంది. ఒంటిమిట్ట మండలంలోని సోమశిల జలాల్లో ఇతర జిల్లాలకు చెందిన మత్య్సకారులు అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ వరకు జలాశయాల్లో చేపల వేటను మత్య్యశాఖ నిషేధించింది.
ఈ 3 నెలలు చేపలు గుడ్లు పెట్టే కాలం కావటంతో చేపల వేటపై నిషేధం ఉంది. అయితే నిబంధనలు అతిక్రమించి కొందరు అక్రమార్కులు చేపల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి...