ETV Bharat / state

రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలంటూ రిలే నిరాహార దీక్ష - రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలంటూ రిలే నిరాహార దీక్ష

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వివిధ ప్రజా సంఘాలు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. జిల్లాకు కావలసిన అన్ని వసతులు ఈ పట్టణానికి ఉన్నందున రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్​ చేశారు.

hunger strike relay in rayachoti
రెవెన్యూ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Oct 2, 2020, 5:00 PM IST

రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెవెన్యూ కార్యాలయం వద్ద రాయచూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు దీక్షలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని అర్హతలు రాయచోటికి ఉన్నాయని నాయకులు అన్నారు. ప్రభుత్వం మౌలిక, భౌగోళిక ఇతర వసతులను పరిగణలోకి తీసుకొని ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :

ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.