కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలిక పరిధిలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని.. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఇదీచదవండి.