ETV Bharat / state

'అమ్మా నేను ఇంగ్లిష్ మీడియం చదవలేను, నాకేమీ అర్థం కావడం లేదు' - కడపలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Degree Student Suicide For Not Understanding Engish Medium : చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివిన ఆ యువతి డిగ్రీలో ఇంగ్లిష్ మీడియంలో చేరింది. ఇంటర్మీడియట్ వరకూ తెలుగు మాధ్యమం కావడంతో చదువు సాఫీగానే సాగింది. కానీ, డిగ్రీలో ఇంగ్లిష్ కారణంగా పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు తల్లితో చెప్పుకొని కన్నీరుమున్నీరైంది. తన బాధను పెద్ద సమస్యగా పరిగణించకపోవడంతో మనస్తాపానికి గురైంది.

degree_student_suicide_in_kadapa_district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 4:17 PM IST

Degree Student Suicide For Not Understanding Engish Medium : ఇంగ్లిష్​ మీడియంలో చదువు అర్థం కాలేదని.. చదువు సరిగ్గా అర్థం కాలేదని మనోవేదనతో బాధపడుతూ... ఓ డిగ్రీ విద్యార్థి (Student) ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప అశోక్ నగర్​లో చోటుచేసుకుంది. కడప కేంద్రం అశోక్​నగర్​కు చెందిన సుమలతకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్ల కిందట భర్త కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సుమలత ముగ్గురు పిల్లలను తానే పోషించుకుంటుంది. సుమలత ప్రభుత్వ బాలికల వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తోంది.

స్నేహితులు మాట్లాడటం లేదని... యువకుని ఆత్మహత్య

Degree Student Suicide in Kadapa District : సుమలత మూడో కుమార్తె అయిన కేజీయా ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివింది. ఇప్పుడు కడప నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతోంది. కానీ కేజీయా చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివిన కారణంగా... డిగ్రీ ఇంగ్లీష్ మీడియం ( english Medium ) కావడంతో సరిగ్గా చదవలేక, చదివింది అర్థం కాక మనోవేదనకు గురవుతుండేదని తన తల్లి సుమలత తెలిపారు.

ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీలో విషాదం.. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య

Young woman commits suicide because doesn't understand English medium : తనకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ఇబ్బందిగా ఉందని తల్లికి చెప్పి అప్పుడప్పుడూ బాధపడుతుండేది. ఈ మాత్రం దానికే ఏమవుతుందిలే అని చెప్పుకుంటూ తల్లి కేజియాకు సర్ది చెప్పుకుంటూ వచ్చేది. పలు మార్లు ఇదే జరగడంతో కేజీయా మనోవేదనకు గురైంది.

'ప్రాణం ఖరీదు రెండు రూపాయలు' ఆరో తరగతి విద్యార్ధి ఆత్మహత్య

Student Suicide In andhra Pradesh : మనస్తాపంతో బాధ పడుతున్న కేజియా మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొనఊపిరితో ఉన్న కేజియాను కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేజియాను పరీక్షించిన వైద్యులు చికిత్స చేయడం ప్రారంభించారు. చికిత్స పొందుతూనే విద్యార్థిని కేజియా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, మృతురాలు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

బస్సు ఫీజు కట్టలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.