నేలను నమ్ముకున్న రైతన్నలు కరోనా ప్రభావంతో నట్టేట మునిగారు. పండించిన పంటలు అమ్ముకునే వెసులుబాటు లేక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో 50 వేల ఎకరాల్లో అరటిని సాగు చేయగా.. అందులో 30 వేల ఎకరాల్లో పంట చేతికి వచ్చింది. జిల్లాలో 2,250 ఎకరాల్లో అరటి, దోస పంటలు సాగులో ఉన్నాయి. వీటితోపాటు సుమారు వెయ్యి ఎకరాల్లో జామను పండించారు. గత నెల కురిసిన వర్షానికి... ఈ నెలలో వీచిన ఈదురు గాలులకు అరటి పంట కుప్పకూలింది. మిగిలి పంట అయిన అమ్ముకుందామంటే కరోనా దెబ్బ పడింది. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం స్తంభించిపోవడంతో ఎక్కడి పంటలు అక్కడే తోటల్లోనే నిలిచిపోయాయి. కడప జిల్లా రాయచోటిలో చూస్తే.. ఓ రైతు దోస, కర్బుజా సాగు చేశారు. 6 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తీరా పంట చేతికి వచ్చే సరికి లాక్డౌన్ తో రవాణా సౌకర్యం లేక.. వ్యాపారులు రాక పంట మొత్తం చేనులోనే మాడిపోయింది. ప్రభుత్వం సహాయం అందించాలని రైతన్నలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:
హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలా?: శ్రీకాంత్ రెడ్డి