ఏపీ-అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తొలివిడతలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాలసేకరణను అవిష్కరించారు. ఈ సందర్బంగా కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లికి చెందిన అశ్విని అనే మహిళా రైతుతో జగన్ మాట్లాడారు. తాను పాడి పరిశ్రమ ద్వారా పాలను అమూల్ ప్రాజెక్ట్‌కు అమ్ముతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆమె సీఎంకు తెలిపింది.
మొదట కడప జిల్లాలో 34 లీటర్లతో మొదలైన ఈ పథకం... ఇప్పుడు 4 వేల లీటర్లకు చేరిందని సీఎం జగన్‌కు జిల్లా కలెక్టర్ హరికిరణ్ వివరించారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సహాయంతో విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జేసి గౌతమి, పాడి పరిశ్రమ మహిళా రైతులు, పాల్గొన్నారు.