ETV Bharat / state

మున్సిపల్ కమిషనర్​పై దాడి కేసు: రిమాండ్​కు 11 మంది నిందితులు

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్​పై దాడికి యత్నించిన వారిపై.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఇద్దరు నిందితులను రిమాండ్​కు పంపగా.. నేడు మరో 9 మందిని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

case filed
రిమాండ్​లో 11 మంది నిందితులు
author img

By

Published : Feb 12, 2021, 2:45 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కమిషనర్ రాధపై దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెుత్తం 11 మందిపై కేసు నమోదు చేశామని.. నిన్న ఇద్దరు నిందితులను రిమాండ్​కు తరలించగా, నేడు మరో 9 మందిని రిమాండ్​కు తరలించినట్లు వివరించారు. అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించారు.

నిన్న కూరగాయల మార్కెట్​లోని గదులను కూలుస్తుండగా.. వ్యాపారులు అడ్డుకోవటంతో ఘర్షణ మెుదలయ్యింది. సంఘటనా స్థలం వద్దే ఉన్న మున్సిపల్ కమిషనర్ రాధపై పలువురు వ్యాపారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు.. మున్సిపల్ కమిషనర్ పరుగులు పెట్టి ఓ దుకాణంలోకి వెళ్లి, షట్టర్ వేసుకున్నారు.

ఇదీ చదవండి: మున్సిపల్ కమిషనర్​పై దాడికి వ్యాపారుల యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.