కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు-లారీ ఢీ కొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకి చెందిన ఐదుగురు కారులో తిరుమల దేవుని దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారని గ్రామస్థులు అన్నారు.
ఇదీ చూడండి