ETV Bharat / state

అఖిలపక్షం ఆధ్వర్యంలో బుగ్గవంక నిర్వాసితుల ఆందోళన - కడపలో అఖిలపక్షం ఆందోళన తాజా వార్తలు

ఒక కుటుంబానికి రూ.500 ఇవ్వడం సరైంది కాదని అఖిలపక్ష పార్టీ నాయకులు అన్నారు. బుగ్గవంక నిర్వాసితులకు ప్రభుత్వం తక్షణం రూ.25 వేలు ఆర్థిక సహాయం చేయాలని కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వరదలు వచ్చి 10 రోజులు అయిన తరువాత మంత్రులు సమీక్ష నిర్వహించటాన్ని నాయకులు ఖండించారు.

Buggawanka Expatriates concern under the all partys
అఖిలపక్షం ఆధ్వర్యంలో బుగ్గవంక నిర్వాసితులు ఆందోళన
author img

By

Published : Dec 7, 2020, 3:10 PM IST

కడప బుగ్గవంక నిర్వాసితులకు ప్రభుత్వం తక్షణం 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బుగ్గవంక నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఆందోళనకారులు కలెక్టరేట్​లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమీక్ష నిర్వహించేందుకు ఇన్​ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కలెక్టరేట్​కు చేరుకున్నారు. అది గమనించిన ఆందోళనకారులు నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు బయటికి రావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని 15 మంది అఖిలపక్ష పార్టీ నాయకులను జిల్లా ఇన్​చార్జ్ మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అఖిలపక్ష పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. వరదలు వచ్చి పది రోజులైనప్పటికీ ఏ ఒక్క అధికారి స్పందించలేదన్న అఖిలపక్షం నాయకులు.. ఇప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించటం దారుణమన్నారు. కేవలం అధికారుల తప్పిదం వల్లనే వరదలు వచ్చాయని ఆరోపించారు.

ఇవీ చూడండి...

నివర్ తుపాను నష్టంపై మంత్రుల సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.